KTR:హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌..మరీ మీకు ఎవరు.?

21
- Advertisement -

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్‌ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సారి 90 నుంచి100 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంచి ప్రదర్శన ఉన్న ఎమ్మెల్యేలకు సీట్లు దక్కుతాయన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలను నిలదీశారు. మాకు సీఎం కేసీఆర్ ఉన్నారు. మరీ మీ పార్టీ తరపున ఎవరు సీఎంగా ఉంటారో చెప్పాలని అన్నారు. ముందుగా సీఎం ఎవరో తెల్చుకోండని సూచించారు.

బీఆర్ఎస్‌ పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుందని అన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. అన్ని రంగాలను అమ్ముతున్నారని అన్నారు. మోదీని గద్దె దింపాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియ నేషనల్ హైవే టెండర్ మాదిరే జరిగిందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై మున్సిపల్ శాఖ ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించింది. చిల్లర మాటలు ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ లేనే లేదు అని కేటీఆర్ అన్నారు. ప్రజలు మత ప్రతిపాదికన ఓట్లు వేస్తారని నేను అనుకోవడం లేదన్నారు. మంచి ప్రభుత్వాన్ని మతాలకతీతంగా ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు. రాష్ట్రంలో మాతో పోటీ పడే స్థితిలో కాంగ్రెస్‌కు లేదన్నారు. భ్రమల్లో కాంగ్రెస్ బతుకుతుందన్నారు.

Also Read: బోనాలు..దేవాలయాలకు ఆర్ధిక సహాయం: తలసాని

జనభా నియంత్రణ చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే నా వాదన. సౌత్ వర్సెస్ నార్త్ అనేది నా వాదన కాదు అని క్లారిటీ ఇచ్చారు. యూపీ లాంటి రాష్ట్రంలో పెరిగే సీట్ల మొత్తం దక్షిణాది రాష్ట్రాల కంటే అధికమని అన్నారు. అందుకే ప్రజలు ఎవరు నష్టపోవద్దని అన్నారు. లోక్‌సభ స్థానాల పెంపుపై ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read: మణిపూర్ సంక్షోభ నివారణకు కమిటీ: అమిత్ షా

- Advertisement -