స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకొంటోంది. నిజానికి ఈ సినిమా షూట్ ఎప్పుడో స్టార్ట్ కావాలి. మహేష్ కూడా ఈ కథకు ఎప్పుడో ఓకే చెప్పాడు. కానీ, కొన్ని కారణాల వల్ల ఇన్నాళ్లు ఈ చిత్రం చిత్రీకరణ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ అయింది. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. త్రివిక్రమ్ గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నాడు. పైగా ఇప్పటికే త్రివిక్రమ్ చాలా కాలం నుంచి వెయింటింగ్ లో ఉన్నాడు. ఎలాగూ మహేష్ కూడా జనవరి కి ఫ్రీ కాబోతున్నాడు. అందుకే, మహేష్ ఈ సినిమాని పట్టాలెక్కించేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఓ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. అందులో షూటింగ్ ప్రారంభించడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా మహేష్ – పూజా హెగ్డే ల మీద లవ్ సీన్లన్నీ తీసేసే విధంగా త్రివిక్రమ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. జనవరి మూడో వారం నుంచి మహేష్ ఈ సినిమాకి డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అరవింద సమేత తరహాలోనే సాగే కథ ఇది. అలాగే పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉంంటాయి. దాంతో పాటుగా…. యాక్షన్ మూమెంట్స్, అండ్ ట్విస్టులూ జోడించుకుని వెళ్లాడట త్రివిక్రమ్. ఓ రాజకీయ అంశం కూడా ఈ కథలో కీలక భాగం కానుంది. అమితాబ్ బచ్చన్ లేదా వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే హిందీ నటుడు సంజయ్ దత్ ని మరో కీలక పాత్ర కోసం తీసుకున్నారు. సినిమాలో సగ భాగం ఢిల్లీ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి…