హాట్ బ్యూటీ రెజీనా ఎంతకష్టపడుతున్నా.. టాప్ హీరోయిన్ హోదా మాత్రం అందని ద్రాక్షే అవుతోందని తెగబాధపడిపోతుందట. తనతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లంతా టాప్ స్టార్లతో నటిస్తున్నారు. రీసెంట్ గా రాశీఖన్నా రాంచరణ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, రెజీనాకు ఇంత వరకు అలాంటి అవకాశం ఒక్కటీ దొరకడంలేదు. దీంతో రెజీనా టాప్ హీరోల పక్కన నటించేందుకు చాలా ప్రయత్నాలే చేస్తోందట. ఆ ప్రయత్నాల్లో భాగంగా స్టార్ హీరోల భజన మొదలు పెట్టింది అమ్మడు.
తాజాగా మహేష్ బాబు, రాంచరణ్ పై రెజీనా ప్రశంసల వర్షం కురిపించేసింది. ఈ ఇద్దరు తనకు ఇష్టమైన సెక్సియెస్ట్ హీరోలు అని చెప్పుకొచ్చేసింది. ఇక ప్రస్తుతం చిన్న హీరోలతోనే పనికానిస్తున్న రెజీనా.. అవకాశాల కోసం గ్లామర్ ను కూడా బాగా దట్టిస్తోంది. దీంతో ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లోనూ అమ్మడికి భారీగానే అవకాశాలు వస్తున్నాయి. అయితే టాప్ హీరోయిన్ కాలేకపోతున్నాని బాధ మాత్రం రెజీనాను ఇంకా వెంటాడుతోంది. మరీ అమ్మడి కోరిక ఎప్పుడు నెరవేరుతోంది చూడాలి.