మహేష్ బాబు మేనత్త ఆమె !

51
- Advertisement -

త్రివిక్రమ్ – మహేష్ కలయికలో రాబోతున్న సినిమాలో మహేష్ కి మేనత్త పాత్ర ఒకటి ఉంది. కథ ప్రకారం ఈ పాత్ర చాలా కీలకం. పైగా ఈ పాత్రలో బరువైన ఎమోషన్స్ ఉండబోతున్నాయి. అందుకే.. ఈ పాత్ర కోసం త్రివిక్రమ్ చాలామందిని చూశాడు. మొదట శోభన అయితే బాగుంటుంది అనుకున్నాడు.పైగా త్రివిక్రమ్ ఆమెను కాంట్రాక్ట్ కూడా చేశాడు. కానీ, శోభన ఈ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. అందుకే.. ఇప్పుడు ఈ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారు. రమ్యకృష్ణ అయితే, సినిమాకి ప్లస్ అవుతుందని.. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఇండియా వైడ్ గా సినిమాకి మార్కెట్ ఉంటుందని మేకర్స్ భావించారు.

అందుకే మహేష్ కి మేనత్తగా రమ్యకృష్ణను ఫైనల్ చేశారు. త్రివిక్రమ్ టీమ్ ప్రస్తుతం షూటింగ్ కోసం లొకేషన్ల వేటలో ఉంది. పూర్తి ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కాబట్టి, సినిమాలో ఓ భారీ చేజింగ్ ఫైట్ ఎపిసోడ్‌ ఉందట. మొదట ఈ ఎపిసోడ్ షూట్ తోనే సినిమా షూట్ ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే, ఆ ఫైట్ లొకేషన్స్ ను వెతికే పనిలో త్రివిక్రమ్ టీమ్ నిమగ్నమై ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు.

రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు పాత్రలో మరో కొత్త కోణం కూడా ఉంటుందని.. తెలుగు సినిమా నేటివిటీకి ఫ్రెష్ టోన్ ను ఈ చిత్రం అందించబోతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి…

#Nani30 గ్రాండ్ గా ప్రారంభం…

ఈ వారం ఓటీటీ కంటెంట్ ఇదే

‘పుష్ప 2’ పై కొత్త కసరత్తులు

- Advertisement -