శాండోస్‌…గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌

44
- Advertisement -

ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా  సంస్థ అయిన శాండోస్ కంపెనీ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌ కేంద్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్‌ని అందించినట్లు తెలిపింది. ఈ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800కు పెంచనున్నట్టు ప్రకటించింది.

మంత్రి కేటీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశమైన శాండోస్‌ కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్‌నోర్‌ ప్రతినిధి బృందం…. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్‌ అండ్ డెవలప్‌ మెంట్ కేంద్రంను మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయి లాబోరేటరీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… శాండోస్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న వ్యాపార అనుకలత అద్భుతమైన మానవ వనరుల ఆధారంగా లైఫ్ సైన్సెస్‌ రంగం మరింతగా వృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పట్టికే ప్రపంచ దిగ్గజ సంస్థ నోవార్టిస్ తన రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కలిగి ఉందని, ఇదే స్థాయిలో శాండోస్ కంపెనీ కూడా హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను విస్తరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపడుతున్న భవిష్యత్తు ప్రణాళికల పైన కంపెనీ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ పలు వివరాలు అందజేశారు. జీనోమ్‌ వ్యాలీ అద్భుతమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కంపెనీకి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి…

పంజాబ్‌లో కొత్త పన్ను…

బీబీసీ డాక్యుమెంటరీపై రష్యా స్పందన..

మొక్కలు నాటిన బాలపురస్కార్ గ్రహిత గౌరవి రెడ్డి..

- Advertisement -