- Advertisement -
ఇటీవల వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డిపై జరిగిన ఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది.ఈ గోరానికి పాల్పడిన నేరస్తులని కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పాశవిక చర్యను ఖండిస్తున్నారు.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు అందరు ఆ దుండగులని జనాల మధ్య ఉరితీసి చంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవీ,పవన్ కల్యాణ్,ఆలీతో పాలు పలువురు ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. తాజాగా ఈ ఘనటపై సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు.
- Advertisement -