టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటు సినిమాలతో అటు యాడ్స్‌తో బిజీ బిజీగా గడుపుతుంటారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న మహేష్ తన సొంతగా వ్యాపారాలు కూడా దూసుకుపోతున్నారు. ఇక ఇటీవల ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేశ్ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు.
మహేష్ త్వరలో సొంతంగా దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి’ అంటూ http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్‌ను మహేష్ బృందం పోస్ట్ చేసింది.
దీన్ని మహేష్ తిరిగి షేర్ చేశారు. ఇందులో మూడు రోజులు కౌంట్‌డౌన్ ఉంచారు. ఈ పేజ్‌లో కింది భాగంలో దుస్తుల రకాలు, బ్రాండ్లు ఉంచారు. దీన్ని బట్టి మరో మూడు రోజుల్లో ఈ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
మరి అందులో ఎలాంటివి విక్రయానికి ఉంచుతారో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి వ్యాపారల్లో ఇదివరకే పలువురు సినీ ప్రముఖలు ఇటు సినిమాలతో అటు వ్యాపారాలలో తమదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు.