ఫిల్మ్ సిటీలో మహేష్ బాబు!

44
- Advertisement -

తెలుగు సినిమాల షూటింగుల అడ్డా… రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ బాబు సంద‌డి చేస్తున్నాడు. త‌న కొత్త సినిమా `గుంటూరు కారం` షూటింగ్ అక్క‌డే జ‌రుగుతోంది. మహేష్ బాబుతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం అంతా ఈ షూటింగ్ లో పాలు పంచుకొంటోంది. రెండు రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో కీల‌క సన్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు. దీంతో షూటింగ్ దాదాపుగా పూర్త‌వుతుంది. మ‌రో షెడ్యూల్ పాట‌ల కోసం కేటాయించారు. మహేష్ బాబు రెండు విభిన్న‌మైన గెట‌ప్పుల్లో క‌నిపించే ఈ చిత్రంలో శ్రీలీల క‌థానాయిక‌గా న‌టిస్తోంది. త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2024 జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.

చాలా గ్యాప్ తర్వాత మహేష్ న‌టిస్తున్న సినిమా ఇదే. అందుకే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పైగా సూపర్ స్టార్ గా మహేష్ బాబుకి పాన్ ఇండియా రేంజ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. మరి మహేష్ మొదటిసారి గుంటూరు కారం సినిమాతో హిందీ ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నాడు. ఇక శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్న గుంటూరు కారం వచ్చే సంక్రాంతికి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమా పై హైప్ ను పెంచడానికి అన్నీ రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినిపిస్తోంది.

Also Read:ధరణిలో మార్పులా? రద్దా ?

- Advertisement -