ఓహ్..ఎన్టీఆర్ అంత తీసుకుంటున్నాడా?

44
- Advertisement -

ఈ మధ్య ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, బాలయ్య లాంటి తెలుగు స్టార్ హీరోలందరూ వరుస సినిమాలతో పాటుగా వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ లలో రానిస్తున్నారు.. ఆ విషయంలో కుర్ర హీరోలందరూ పోటి పడుతున్నారు. ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు యాడ్ షూట్ లు కూడా చేస్తున్నారు ఎన్టీఆర్. అలాగే, మొన్నీమధ్య ఎన్టీఆర్ మలబార్ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ప్రచారంతో సదరు సంస్థ సేల్స్ బాగానే పెరిగినట్లు తెలుస్తోంది. దీనితో ఎన్టీఆర్ కి వరుసగా యాడ్ లో నటించే డీల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ మరో యాడ్ కి సైన్ చేశారు. మరో భారీ షాపింగ్ మాల్ చైన్ కి సంబందించిన యాడ్ ఇది. దీనికోసం ఎన్టీఆర్ ఆల్రెడీ ఫోటో షూట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ షాపింగ్ మాల్ కంపెనీ మొదటి మాల్ ప్రారంభోత్సవానికి కూడా ఎన్టీఆర్ హాజరు కానున్నారట. అయితే, ఆ యాడ్ కోసం ఎన్టీఆర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఆ యాడ్ కోసం ఎన్టీఆర్ రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా, హోస్ట్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్ ఇలా వరుస చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు తారక్. ప్రస్తుతం ఎన్టీఆర్హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:ధరణిలో మార్పులా? రద్దా ?

- Advertisement -