వేములవాడకు హెలికాప్టర్ సేవలు…

314
srinivas goud
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. మహాశివరాత్రి నేపథ్యంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ సహకారంతో ఈ సేవలను ప్రారంభించింది.

మూడు ప్యాకేజీల రూపంలో సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా బేగంపేటలో హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ నెల 23వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మంత్రి కేటీఆర్‌ సూచనతో వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మిడ్‌మానేరును పర్యాటక హబ్‌గా చేసేందుకు చర్యలు చేపట్టామని మిడ్‌మానేరు నుంచి సిరిసిల్లకు బోటు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ప్యాకేజీ-1లో భాగంగా వేములవాల నుంచి వ్యూపాయింట్‌కు 7 నిమిషాల రైడ్‌కు టికెట్‌ ధర రూ.3 వేలు. ప్యాకేజీ-2లో వేములవాడ మిడ్‌మానేరు పరిసర ప్రాంతాలు తిలకించేందుకు రూ.5,500. కనీసం ఆరుగురు వ్యక్తులు ఉండాలి. 16 నిమిషాల విహంగ వీక్షణం. ప్యాకేజీ-3లో హైదరాబాద్‌ నుంచి వేములవాడకు తిరిగి హైదరాబాద్‌కు. టికెట్‌ ధర రూ. 30 వేలు. కనీసం ఐదుగురు వ్యక్తులు ఉండాలి.

- Advertisement -