అక్కడ ఆలయాల్లో వస్త్రధారణ తప్పనిసరి ప్రతి ఒక్కరూ సంప్రదాయలతో కూడిన వస్త్రధారణ వేసుకోవాలని, ఆ దిశగా ఆలయాలు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడుకునేందుకుగానూ మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ నిర్ణయించింది. దీంతో మహారాష్ట్రలో విస్తృతంగా ప్రచారం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130కిపైగా ఆలయాలు ఈ డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నాయి. దీంతోపాటు పుణ్యక్షేత్రాలకు 500మీటర్ల పరిధిలో మద్యమాంసాల విక్రయాలపైనా నిషేధం విధించాలని మహాసంఘ్ కోరుతోంది. ఈ సంఘంలో ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, పూజారులు, న్యాయవాదులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా ఓప్రకటన జారీ చేశారు.
ప్రజలను దేవుళ్లకు దూరం చేయడం మా ఉద్దేశం కాదు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పాపులారిటీ కోసం సరైన వస్త్రధారణ లేకుండా ఆలయాలకు వచ్చి వీడియోలు చేస్తున్నారు. ఏ ప్రార్థనా స్థలం అయిన పవిత్రతను కాపాడుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయాల సందర్శన సమయంలో ఎటువంటి వస్త్రాలు ధరించకూడదనే దానిపై దృష్టిసారిస్తున్నాం. రివీలింగ్, షార్ట్ ఫిట్టింగ్ లేదా బిగుతుగా ఉండే వస్త్రాలు, చిరిగిపోయిన దుస్తులు వంటివి ఇందులో వస్తాయి. ఫ్యాంటు, చొక్కాల వంటివాటిపై ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ యేడాది చివరి నాటికి వీలైనన్ని ఎక్కువ ఆలయాలు దీన్ని అమలు చేస్తాయని చెప్పారు. ఆచార, సంప్రదాయాల ప్రకారం జంతుబలులు మినహాయించి…దేవాలయాలకు 500మీటర్ల పరిధిలో మద్యమాంసాల వాణిజ్య అమ్మకాలను నిషేధించాలనీ మహాసంఘ్ సమన్వయ కర్త సునీల్ డిమాండ్ చేశారు.
Also Read: H-1B వీసా ప్రత్యేకతలు…