- Advertisement -
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తారాస్ధాయికి చేరుకుంద. ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను గవర్నర్ భగవత్ సింగ్ కోశియారి ఆదేశించారు.
గురువారం సాయంత్రం 5 గంటల లోపు సీఎం ఉద్దవ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బలపరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. అయితే ఆ అసెంబ్లీ సమావేశాల్ని రికార్డ్ చేయాలని కూడా గవర్నర్ కోశియారి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
శివసేన పార్టీలో వచ్చిన చీలికలతో మహా వికాశ్ అగాధీ కూటమి ఇబ్బందుల్లో పడింది. తనతో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
- Advertisement -