మహానుభావుడు మళ్లీ కొట్టేస్తాడా..!

287
Mahanubhavudu to breaks Shatamanam Bhavati’s record..!
- Advertisement -

శతమానంభవతి హిట్ తర్వాత శర్వానంద్ నటిస్తున్న చిత్రం మహానుభావుడు. భలే భేలే మగాడివోయ్ ఫేం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌ తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా శర్వానంద్ సరసన కృష్ణగాడి వీర ప్రేమకథ భామ మెహరీన్ హీరోయిన్‌గా నటించింది.

ఈ ఏడాది సంక్రాంతికి చిరు ఖైదీ నెంబర్ 150, బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి వంటి పెద్ద సినిమాల మధ్య విడుదలైన శర్వానంద్ శతమానంభవతి మంచి వసూళ్లను రాబట్టింది.ఈ నేపథ్యంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు శర్వానంద్.

ఇప్పటికే జూనియర్  ఎన్టీఆర్ నటించిన జై లవకుశ హిట్ టాక్‌తో దూసుకుపోతు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక మహేష్ స్పైడర్ సైతం మంచి వసూళ్లను రాబడుతు ప్రేక్షకుల మన్ననలను పొందుతోంది. ఈ నేపథ్యంలో రేపు శర్వానంద్ మహానుభావుడు అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సుమారు 400 థియేటర్స్ లలో మహానుభావుడు సందడి చేయనున్నాడు. గుంటూరు, నెల్లూరు, సీడెడ్లలో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, నైజాం, వైజాగ్ లలో దిల్ రాజు, ఉభయ గోదావరి జిల్లాలో గీతా ఆర్ట్స్ వంటి ప్రముఖులు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో సినిమాకు సుమారు 400 లకు పైగానే స్క్రీన్లు దొరికాయి.

సినిమా టాక్ బాగుంటే పెద్ద సినిమాల హడావుడి కాస్త తగ్గితే ఇవి మొత్తం ఇంకాస్త పెరిగే ఛాన్సుంది. ఇక ఓవర్సీస్లో సైతం ‘స్పైడర్, జై లవ కుశ’ హవా నడుస్తున్నా కూడా సుమారు 125 కి పైగా లొకేషన్లలో మహానుభావుడు కు థియేటర్లను థియేటర్స్ దొరకడం విశేషం.

- Advertisement -