మొక్కలు నాటిన మహాబుబాబాద్ కలెక్టర్..

644
Mahabubabad Collector
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మహాబుబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మొక్కలు నాటారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌ రాజీవ్ గాంధీ హనుమంతు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలంజ్‌లో భాగంగా మహాబుబాబాద్ కలెక్టర్ కార్యాలయ పార్కులో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఐ ఏ ఎస్ 3 మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాతావరణ సమతూల్యత కోసం, వర్షాలు సకాలంలో కురువాలన్న, పర్యావరణ పరిరక్షణ కోసం మనం విరివిగా మొక్కలు నాటాలి. పూల మొక్కలు, పండ్ల మొక్కలు నాటడం వల్ల మనకే కాదు పరోక్షంగా జీవరాశులకు ఉపయోగం అన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను మరో ముగ్గురికి అభిలాష అభినవ్ ఐఏఎస్ గారు , అడిషనల్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారు , డి ఎఫ్ ఓ టి రవికిరణ్ ఐ ఎఫ్ ఎస్ గార్లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరి త్వరితగతిన మొక్కలు నాటాలన్నారు.

- Advertisement -