డ్రోన్‌తో డోర్‌ డెలివరీ..!

588
Walmart
- Advertisement -

డ్రోన్లతో డోర్‌ డెలివరీ.. ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే.. ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది. నిత్యావసర సరుకులను ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. అమెరికాలోని నార్త్ కరోలినాలోని బెంటర్ విల్లేలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టింది.

డెలివరీ సంస్థ ఫ్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల ద్వారా వినియోగదారులకు బుధవారం నుంచి సరుకులు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా వాల్ మార్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ముందు రోజుల్లో డ్రోన్ల ద్వారా భారీ ఎత్తున్న డెలివరీ చేయడాన్ని చూస్తామని చెప్పింది.

- Advertisement -