కంగనాకు కోలీవుడ్‌ హీరో మద్దతు..!

224
Hero Vishal
- Advertisement -

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేలపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కంగనపై ముంబైలో జరుగుతున్న పరిస్థితులను చూసి చాలా మంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఎందుకు ఆమెను అంతగా టార్గెట్ చేస్తున్నారు.. ప్రభుత్వం చేసిన తప్పులను నిలదీయడమే ఆమె చేసిన పాపమా అంటూ చాలా మంది కంగనకు సపోర్టుగా నిలుస్తున్నారు. తాజాగా కంగనాకు హీరో విశాల్ తన మద్దతును ప్రకటించాడు.

‘డియర్ కంగన… నీ గట్స్ కు, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని నీవు ఎదుర్కొంటున్నావు. ధైర్యంగా నిలబడ్డావు. 1920లలో భగత్ సింగ్ చేసిన మాదిరి చేస్తున్నావు. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు తమ గొంతుకను ఎలా వినిపించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీనే కాకుండా ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చావు. నీకు వందనాలు’ అని విశాల్ అన్నాడు. అంతేకాదు ‘వాక్ స్వాతంత్ర్యపు హక్కు (ఆర్టికల్ 19)’ అని సోషల్ మీడియా ద్వారా కంగనకు ఒక లేఖను పంపాడు.

- Advertisement -