హీరో విశాల్‌కు కోర్టు నోటీసులు..

227
vishal
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ న‌టిస్తోన్న తాజా చిత్రం చ‌క్ర‌. ఈ చిత్రాన్ని ఎం.ఎస్‌.ఆనంద్ డైరెక్ట్‌ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హీరో విశాల్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల కాకముందే వివాదంలో పడింది. చక్ర విడుదలను ఆపాలంటూ నిర్మాణ సంస్థ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ హైకోర్టులో కేసు వేసింది. కేసును పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టు విశాల్‌కు, డైరెక్టర్‌ ఆనందన్‌కు నోటీసులను జారీ చేసింది.

ఇక అసలు విషయం ఏంటంటే.. విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ నిర్మించిన చిత్రం ‘యాక్షన్’ చేసిన విషయం తెలిసిందే‌. ఈ మూవీని రూ.44 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా విడుదల సమయంలో రూ.20 కోట్ల వరకు హీరో విశాల్‌ గ్యారెంట్‌ ఉండేలా అగ్రిమెంట్స్‌ రాసిచ్చాడట. కానీ ఈ సినిమా నష్టాలను మిగిల్చిందాట. ఈ నష్టాలను భరించడానికి విశాల్‌ తన తదుపరి చిత్రాన్ని ఆనంద్‌ దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే చేస్తానని అన్నాడట. కానీ అలా కాకుండా విశాల్‌ తన బ్యానర్‌లో సినిమాను విడుదల చేస్తున్నారని. తమకు న్యాయం జరిగే వరకు చక్రను అపాలంటూ కోర్టును ఆశ్రయించారు సదరు నిర్మాణ సంస్థ. ఈ నేపథ్యంలో హీరో విశాల్‌,డైరెక్టర్‌ ఆనంద్‌కు కోర్టు నోటీసులు పంపింది.

- Advertisement -