సీనియర్ హీరోయిన్ ‘మాధురీ దీక్షిత్’ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె నటిస్తున్న మొదటి చిత్రం తెలుగులోనే కావడం విశేషం. “పుష్ప 2” చిత్రంలో ఆమె అల్లు అర్జున్ పాత్రకి పోటీగా కనిపించబోతుంది. అల్లు అర్జున్ సినిమాతో పాటు ఈ ముదురు భామ సౌత్ లో రెండో సినిమాగా ఒక తమిళ చిత్రం సైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అజిత్ హీరోగా రూపొందే కొత్త పాన్ ఇండియా చిత్రంలో మాధురీ దీక్షిత్ ని తీసుకున్నట్లు తమిళ సినిమా వర్గాలు వార్తలు రాస్తున్నాయి.
ఐతే, ఈ విషయంలో అధికారికంగా కన్ ఫర్మేషన్ లేదు. అలాగే, బాలీవుడ్ దర్శకుడు రాకేష్ మెహ్రా కర్ణ అనే సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాని తీసే ఆలోచనలో ఉన్నారట. కర్ణుడి తల్లి పాత్రలో మాధురీ దీక్షిత్ తీసుకుంటారని మరో వార్త సారాంశం. మొత్తానికి మాధురీ దీక్షిత్ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేలా ఉంది. మాధురి దీక్షిత్ 1980ల నుంచి 1990ల వరకు హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి, మంచి డ్యాన్సర్ గా ఫుల్ క్రేజ్ సాధించింది.
పైగా ఆ రోజుల్లో మాధురీ దీక్షిత్ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకు గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకుంది. అలాగే, బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరిగా మాధురీ దీక్షిత్ కి గుర్తింపు ఉంది. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించింది కూడా. ఏది ఏమైనా మాధురీ దీక్షిత్ మళ్ళీ సినిమాల్లో ఫుల్ బిజీ అయితే చూడాలని ఆమె అభిమానులు ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు.
Also Read:కాంగ్రెస్‌కు షాక్..సోనియాకు కరెంటు బిల్లులు పోస్ట్