20 ఏళ్ల సినీ ప్రస్ధానంపై మాధవన్‌!

211
madhavan
- Advertisement -

మాధవన్‌….కోలీవుడ్,టాలీవుడ్,బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమక్కర్లేని పేరు. వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్న మాధవన్‌…హీరోగా, విలన్‌గా ఏ పాత్రైనా దానికి వన్నె తెచ్చాడు.

మాధవన్‌….ఇండస్ట్రీలోకి ఎంటరై నేటికి సరిగ్గా 20 ఏళ్లు. ‌జీనే భీ దో యారో అనే హిందీ సీరియల్‌తో న‌టుడిగా ఆరంగేట్రం చేసిన మాధ‌వ‌న్ …. ‘ఇన్‌ఫెర్నో’ సినిమాతో 1997లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.

తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో వెండితెరకే వన్నె తెచ్చాడు మాధవన్. మాధవన్‌ ఇండస్ట్రీకి పరిచయమై 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హియా చ‌ద్దా అద్భుత వీడియోని రూపొందించారు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన మాధవన్…తన 20 ఏళ్ళ సినీ ప్ర‌యాణం అద్భుతంగా సాగిందని పేర్కొన్నారు.

- Advertisement -