కోదండరాంపై కేసీఆర్‌ ఫైర్‌

220
Made history at Singareni
- Advertisement -

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌కు ఘన విజయం అందించిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. సింగరేణి మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నింటినీ నేరవేరుస్తామని చెప్పారు. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం సింగరేణిలో ప్రతిపక్షాల కూటమిని కార్మికులు తిప్పికొట్టారన్నారు. విపక్షాలు పూర్తిగా అబద్దాలను ప్రచారం చేశాయన్నారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీ టీబీజీకేఎస్‌కు వచ్చిందన్నారు.

మా ప్రభుత్వ పనితీరుకు ఉప ఎన్నికల ఫలితాలతో పాటు సింగరేణి ఫలితాలు నిదర్శనమని  చెప్పారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను అడ్డుకుంది విపక్షాలేనని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు సీఎం. టీజేఏసీ ఛైర్మన్ కొదండరాం, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ పై మండిపడ్డారు సీఎం. సింగరేణిలో టీబీజీకేఏస్‌ అధికారంలోకి వస్తే నాశనం అవుతుందని కోదండరాం విష ప్రచారం చేశారన్నారు. కొదండరాం తనకున్న శక్తిని తెలుసుకోని మాట్లాడాలని హితవు పలికారు. కోదండరాం జీవితంలో సర్పంచ్ అయిండా…ఆయన పిలుపు ఇవ్వడానికి ఏమైన జాతీయ నాయకుడా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్‌కు లక్ష్యం లేదు ఇప్పుడు లక్ష్యం లేదన్నారు.
ఉత్తమ్ కుమార్ పిచ్చిమాటలు మాట్లాడటం మానుకోవాలన్నారు.

మేమే ప్రత్యామ్నాయమని చెప్పిన బీజేపీ అనుబంధ సంఘానికి కేవలం246 ఓట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు.భూ సమస్యల పరిష్కారానికే ప్రక్షాళన చేపట్టామని తెలిపిన సీఎం…దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా ఎకరాకు రూ.8 వేలు ఇస్తున్నామని చెప్పారు. రైతు సమన్వయ సమితులను అడ్డుకునేందుకు హైకోర్టులో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు సీట్లతో గెలిచిందని ఇప్పుడు అదే ఫలితం సింగరేణిలో రిపీటైందన్నారు.

గతంలో ఏ సంఘం 9 డివిజన్లలో గెలిచిన చరిత్ర లేదన్నారు. కార్మికుల సొంతింటి కోసం రూ.6 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చి తీరుతామన్నారు. సింగరేణి చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కార్మికులకు అండగా నిలిచామని తెలిపారు. వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాలుగా పరిగణించి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు.

- Advertisement -