లక్కీ ఛాన్స్ …బుల్లెట్ భాస్కర్‌

40
- Advertisement -

జబర్దస్త్‌ షో అంటే తెలుగు నాట ప్రేక్షకులకు పిచ్చపాటి కాలక్షేపం. గురువారం, శుక్రవారం రోజుల్లో ప్రసారమయ్యే ఈ షోలో లక్కీ ఛాన్స్‌ కొట్టేశారు మన బుల్లెట్ భాస్కర్‌. ఫిబ్రవరి 3న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో భాగంగా ప్రోమోను విడుదల చేశారు మల్లెమాల టీం. ఇందులో ఇమ్మూ, వర్షలు హానీమూన్‌ కోసం గోవా వెళ్లడానికి పడవ ప్రయాణం మొదలు పెడతారు. కానీ పడవ నడిపే నావికుడు భాస్కర్‌, నరేశ్ చేసిన కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది.

జబర్దస్త్‌ షోకి ఖుష్బూ, కృష్ణ భగవాన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఖుష్బూ…బుల్లెట్‌ భాస్కర్‌కు భారీ బహుమతి ఇచ్చేసింది. 80s-90s హీరోలతో ఆడిపాడిన ఖుష్బూ…ఈ షో ద్వారా బుల్లెట్ భాస్కర్‌తో డ్యాన్స్ చేసింది. ఇంతకీ ఏ పాట అనుకున్నారు… ఎన్నో రాత్రులు వస్తాయి కానీ…అనే పాటకు ఖుష్బూ భాస్కర్ పడవ సెట్‌పై అదరగొట్టేశారు. అన్నట్టు గతేడాది కూడా ఇలాంటి ఆఫర్‌ను ఇచ్చేసింది ఖుష్బూ. దీంతో ఆగకుండా కృష్ణ భగవాన్ భాస్కర్ ఒక సలహా కూడా ఇచ్చారు. ఎంటంటే… నీ లైఫ్‌లో ఎమైనా సాధించావా అని అడిగితే ? నేను ఖుష్బూ గారితో డ్యాన్స్ చేశానని చెప్పు అని సమాధానం ఇచ్చారు తాఫీగా .

ఇవి కూడా చదవండి…

‘పుష్ప 2’ పై కొత్త కసరత్తులు

సూర్య , చరణ్ కాంబో సెట్ ?

చిరు గుడ్ న్యూస్

- Advertisement -