ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇకలేరు..

39
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు సిస్టర్ లూసిల్ రాండన్(118) కన్నుమూశారు. ఫ్రెంచ్ సన్యాసి అయిన లూసిల్ మంగళవారం రాత్రి నర్సింగ్ హోమ్‌లో మరణించారు. మరో నెల రోజుల్లో 119వ పుట్టినరోజు జరుపుకోనుండగా ఆమె మరణించడం గమనార్హం.

లూసిల్‌ రాండన్‌ 1904, ఫిబ్రవరి 11న జన్మించారు. 1944లో సిస్టర్‌ ఆండ్రీగా మారిన ఆమె 1918లో స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి నుంచి బయటపడ్డారు. కొవిడ్‌-19 నుంచి బయటపడిన అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు.

ఆవెర్గ్నే-రోన్‌-ఆల్ఫ్స్‌లోని దవాఖానలో 28 ఏళ్లపాటు అనాథలు, వృద్ధులకు సేవలు అందించారు. ఇప్పటి వరకు నమోదైన ఫ్రెంచ్‌, యూరోపియన్‌ వృద్ధులలో ఆండ్రీ మూడో వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -