- Advertisement -
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. సబ్సీడియేతర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ రూ. 744కి లభించనుంది. గత నెలలో ఇది రూ. 805.5 ఉండగా రూ. 61.5 రూపాయలు తగ్గింది.
- Advertisement -