Sonia:సోనియాకు ‘ఓటమి’ భయం!

24
- Advertisement -

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాత్రల పేరుతో పర్యటనలు కూడా చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈసారి కూడా ఓటమి తప్పదని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గెలుస్తుందనే దైర్యం ఆ పార్టీ నేతల్లోనే లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ రకమైన విమర్శలు రావడానికి కారణం కూడా లేకపోలేదు. ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ లోక్ సభ ఎన్నికల బరిలో కాకుండా రాజ్యసభ ఎన్నికల బరిలో దిగడం అందరినీ ఆలోచింపజేసే అంశం. దీంతో ఆమెకు ఓటమి భయం పట్టుకున్నందునే లోక్ సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు బీజేపీ వ్యంగ్యస్త్రాలు సంధిస్తోంది. .

ఇప్పటివరకు లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి గెలుస్తూ వచ్చారామె. అయితే గత ఎన్నికల్లో అమేథీ నుంచి కూడా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీంతో సారి ఎన్నికల్లో రాయ్ బరేలీలో కూడా ఓటమి తప్పదేమో అనే భయంతో సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారా అనే రకరకాల సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవడం వెనుక ఏమైనా స్ట్రాటజీ ఉందా ? అసలు కాంగ్రెస్ అధినాయకత్వం ఏం ఆలోచిస్తోంది అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. అయితే కాంగ్రెస్ పెద్దల వ్యూహాలు ఎలా ఉన్నాప్పటికి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవడం ఆ పార్టీకి కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన సోనియా గాంధీ సడన్ గా రాజ్యసభకు పోటీ చేయడం వల్ల ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మరి సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేయడం కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Also Read:యాక్టీవ్ అవుతున్న కీర్తి సురేష్

- Advertisement -