ఆపరేషనే దర్శకరత్న మృతికి కారణమా..?

283
Lose Weight Caused Dasari's Death
Lose Weight Caused Dasari's Death
- Advertisement -

స్టేజీ నాటకాల దగ్గరి నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా.. పాలకొల్లు నుంచి పార్లమెంటు వరకు.. దాసరి నారాయణరావు జీవితం ఓ సుదీర్ఘ ప్రయాణం. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది శిష్యులను ఆయన తీర్చిదిద్దారు.  అలాంటి దాసరి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూసారనే వార్త బయటకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేని దాసరి ఐసీయూ లో చికిత్స తీసుకునే అంత అనారోగ్యం ఏంటనేదే అందరి అనుమానం.

అసలు ఈ ఆర్నెల్లు  ఆసుపత్రిలో దాసరికి ఏం జరిగింది ? ఆయన మరణానికి కారణం ఏంటనేది దాసరి కూతురు హిమాలయ వెల్లడించింది. దాసరి మొదట జనవరి 31న ఆసుపత్రిలో చేరారు.. రెండు నెలల ట్రీట్‌మెంట్‌ తరువాత మార్చి 28న డిశ్చార్జ్ అయి ఇంటికోచ్చారు. అప్పటివరకు దాసరి బాగానే ఉన్నారు. సినీ రంగ ప్రముఖుల మధ్య మే 4న పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. ఇంతలో మే మూడవ వారంలో మళ్లీ దాసరి ఆసుపత్రిలో చేరారు. ఈ సారి ఆసుపత్రిలోనే కన్నుమూశారు దాసరి.

Dasari-Narayana-Rao

దాసరి నారయణరావు మరణించడానికి ఆయనకు రెండవసారి జరిగిన బాలూన్ సర్జరీ కారణమనే ఆయన కూతురు వెల్లడించింది. ఆమె మాటల్లోనే “బరువు తగ్గేందుకు తోడ్పడే సర్జరీ ఒకటి నాన్నగారు గత ఏడాది చేయించుకున్నారు. అప్పుడది బాగానే పని చేసింది. ఐతే జనవరిలో రెండోసారి కూడా అలా బెలూన్ వేయించుకొనే సర్జరీకి వెళ్లారు. కానీ మొదటిసారి సర్జరీ చేసిన డాక్టర్ ఈసారి లేరు. దీంతో మరో డాక్టర్ తో ఆ సర్జరీ చేయించుకున్నారు. ఎక్కడో తేడా వచ్చి.. ఇంటికొచ్చాక అది సీరియస్ అయింది. మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తే… సర్జరీ ఫెయిలైంది..అన్నవాహికలో బెజ్జం పడిందని డాక్టర్లు చెప్పారు. అలాగే ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోవడంతో వరుసగా ప్రొసీజర్ల మీద ప్రొసీజర్లు.. సర్జరీల మీద సర్జరీలు జరిగాయి.

ఐతే సీరియస్ కండిషన్ నుంచి ఎలాగోలా బయటపడి.. మార్చి 28న ఇంటికొచ్చారు. అప్పట్నుంచి పొట్ట దగ్గర ట్యూబు ద్వారా ద్రవాహారం తీసుకుంటూ కొద్దిగా కోలుకుంటూ వచ్చారు. ఐతే మామూలుగా నోటి ద్వారా తినేలా అన్నవాహికను పునర్నిర్మించేందుకు ఇంకో సర్జరీ కోసం మే మూడో వారంలో  ఆసుపత్రిలో చేరారు. అప్పుడు పెద్ద పేగును కట్ చేసి.. కృత్రిమంగా అన్నవాహికను నిర్మించే సర్జరీ చేశారు. తీరా అది ఫెయిలైంది. అవయవాలు ఒక్కొక్కటి పని చేయడం మానేశాయి. ఇంతలో జరగరానిది జరిగిపోయింది” అని హేమాలయ వివరించారు.

- Advertisement -