లోకేశ్ పాదయాత్ర.. ఎవరికి దడ ?

71
- Advertisement -

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నారాలోకేశ్ ” యువగళం ” పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రను నేటి నుంచే కుప్పం నుంచి ప్రారంభించారు నారా లోకేశ్. కుప్పం నుంచి మొదలు కొని ఇచ్చాపురం వరకు 400 రోజులలో 4 వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. లోకేశ్ చేపడుతున్న ఈ పాదయాత్రను వైసీపీ మొదటి నుంచి కూడా లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. కానీ టీడీపీ మాత్రం లోకేశ్ పాదయాత్రతో ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సిన నేపథ్యంలో పార్టీకి లోకేశ్ పాదయాత్ర మంచి మైలేజ్ తీసుకొస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. .

అయితే మొదటి నుంచి కూడా లోకేశ్ పై ఎన్నో రకాల విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ విమర్శలన్నిటికి చెక్ పెట్టేందుకు పాదయాత్ర చాలా హెల్ప్ అవుతుందని పలువురి అభిప్రాయం. కాగా లోకేశ్ పాదయాత్రపై మొదట కొన్ని అడ్డంకులు ఏర్పడినప్పటికి షరతులతో కూడిన అనుమతి లభించింది. ఇక తాజాగా లోకేశ్ పాదయాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్ల వర్షం కురిపించారు. లోకేశ్ పాదయాత్ర కాదని.. అది టీడీపీ పాడే యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్ ఒక అసమర్ధుడని ఆయనకు పార్టీ అధికారంలోకి తీసుకోచ్చేంత కెపాసిటీ లేదంటూ కొడాలి నాని అన్నారు.

చంద్రబాబు 420 అయితే లోకేశ్ 210 అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని. ఇక మరోవైపు నారా లోకేశ్ మాత్రం ఇలాంటి విమర్శలన్నిటికి చెక్ పెడుతూ కుప్పం నుంచి పాదయాత్రకు తొలి అడుగు వేశారు. ఆ తరువాత కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ” యువగళం పేరుతో పాదయాత్ర ప్రకటించగానే వైసీపీ నేతల ఫ్యాంట్లు తడిసి పోతున్నాయని ఎద్దేవా చేశారు. ఏ అర్హతతో పాదయాత్ర చేపడుతున్నావనే వారికి ఒక్కటే సమాధానం అంటూ.. రెండున్నర ఏళ్ళు మంత్రిగా పని చేసి 25 వేల కి.మీ సిసి రోడ్లు, 25 లక్షల వీధి దీపాలు, 40 వేల ఉద్యోగాలు.. ఇలా ఎన్నో చేశా ఈ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్న అంటూ లోకేశ్ చెప్పుకొచ్చారు. ఇక లోకేశ్ పాదయాత్రతో వైసీపీ నేతల్లో దడ మొదలైందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారం ఖాయం అంటూ తెలుగు తమ్ముళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి లోకేశ్ పాదయాత్ర టీడీపీకి ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

తారకరత్నకు తీవ్ర అస్వస్థత

మీలో ఎవరు సి‌ఎం అభ్యర్థి?

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్లు.. !

- Advertisement -