క‌రోనా…5 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన లోకా భూమారెడ్డి

316
loka bumareddy
- Advertisement -

కరోనా నివారణ కోసం రూ.5 లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి ప్రకటించారు రాష్ట్ర డెయిరీ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మన్ లోకా భూమారెడ్డి.

అదిలాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలను ప్ర‌శంసించారు. విజయ డైరీ తరపున 5 లక్ష‌ల రూపాయలు విరాళంగా ప్రకటించిన‌ట్లు తెలిపారు.

రాష్ట్రంలో పాలు కొరత లేకుండా ప్రభు త్వ పరంగా విజయ డెయిరీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంద‌న్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పాలు రాష్ట్ర సరిహద్దులు మూసి వేసిన నేపథ్యంలో మన రాష్ట్రానికి పాలు సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు అవసరమైన పాలను సరఫరా చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాం అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో విజయ పాలు సేకరణ కేంద్రాలలో పాలను రైతుల వద్ద నుంచి సేకరించి వినియో గదారులకు అందించేందుకు చర్యలు చేపట్టామ‌ని వెల్ల‌డించారు.

లాక్ డౌన్ రెండో రోజు సందర్భంగా ప్రవేటు డెయిరీ లకు పాలు పోసే రైతులు ఇబ్బంది పడుతుంటే, వారి ఇబ్బందలను గమనించి విజయ తెలంగాణ డెయిరీ ఆ రైతుల పాలను సేకరించి రైతులకు అండగావుంది.దాదాపు రోజు పాల సేకరణ కంటే 20000 వేల లీటర్ల అధికంగా సేకరిస్తుంది రానున్న రోజుల్లో ఇంక పాలసేకరణ పెరిగే అవసరం వుంది. ఆ పాల సేకరణ కూడ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండ సేకరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము.

పాల అమ్మకాలు 40, 000 లీటర్లు పెరిగింది,‌స్పెషల్ డ్రైవ్ ద్వారా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్  వినయోగదారుడికి‌ ఎటువంటి సమస్య లేకుండా పాల సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మార్చి 31 లోగ అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది .

- Advertisement -