ఈ ఏడాది మార్చి లేదా ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల వేళ సర్వేల కోలాహలం మొదలైంది. ఈసారి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఇప్పటికే చాలా సర్వేలు తెరపైకి వచ్చాయి. ఇక తాజాగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో నిర్వహించిన సర్వే బయటకు వచ్చింది. ఈ సర్వే ప్రకారం ఉత్తరాదిన మళ్ళీ బీజేపీ ఆధిక్యం కనబరిచే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఇండియా కూటమి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఉత్తరాదిన మెజారిటీ సీట్లను ఎన్డీయే కూటమి సొంతం చేసుకునే అవకాశం ఉందని ఇండియా టుడే తేల్చి చెప్పింది.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 70, ఎస్పీ 07, కాంగ్రెస్ 01 సొంతం చేసుకొనున్నాయట. రాజస్థాన్ లో బీజేపీ 25 స్థానాలను క్లీన్ స్వీప్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీ 10, కాంగ్రెస్ 01, పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 19, టీఎంసీ 22, మధ్య ప్రదేశ్ లో బీజేపీ 27, కాంగ్రెస్ 02, బిహార్ లో ఎన్డీయే 32, ఇండియా కూటమి 08, సొంతం చేసుకొనున్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇక దక్షిణాది విషయానికొస్తే కర్ణాటకలో బీజేపీ 24, కాంగ్రెస్ 04, తమిళనాడులో డీఎంకే 39 క్లీన్ స్వీప్.. చేయనుందట. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో టీడీపీ 17 స్థానాలు, వైసీపీ 08 స్థానాలు సొంతం చేసుకుంటాయని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. తెలంగాణలో ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. ఓవరాల్ గా నార్త్ లో బీజేపీ సత్తా చాటిన సౌత్ లో మాత్రం ప్రాంతీయ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉండనున్నట్లు మూడ్ ఆఫ్ నేషన్ సర్వే వెల్లడించింది.