లోక్‌సభ ఎన్నికలు.. ఓటు వేసిన ప్రముఖులు..!

272
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో మొత్తం 72 నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్‌ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఓటింగ్‌లో భాగంగా.. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీతో పాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీం‍ద్ర సహా పలువురు ప్రముఖులు సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు ప్రముఖ బాలీవుడ్ తారలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Lok Sabha Election 2019

బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖ, ఇంటర్నేషనల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, ముంబై నార్త్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి, సినీ నటి ఉర్మిళ మతోండ్కర్‌, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ పరేశ్‌ రావల్‌ దంపతులు, బీజేపీ మధుర ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆమె కూతుర్లు ఈషా డియోల్‌, అహనా డియోల్‌, ప్రముఖ బాలీవుడ్‌ సూపర్ స్టార్, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ఖాన్‌ ఆయన సతీమణి కిరణ్‌రావ్‌, సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌, బాలీవుడ్‌ తారలు అజయ్‌ దేవ్‌గణ్‌, కాజల్‌ దంపతులు, అనుపమ్‌ ఖేర్‌, ప్రియాదత్‌ గేయ రచయిత గుల్జర్‌, నటి కంగనా రనౌత్‌, రేసుగుర్రం ఫేమ్‌ రవి కిషన్‌, టైగర్‌ శ్రాఫ్‌ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- Advertisement -