- Advertisement -
హైదరాబాద్‌కు చెందిన బూజీ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ సంస్థ పది నిమిషాల్లో లిక్కర్‌ను డోర్ డెలివరీ చేసేందుకు ముందుకొచ్చింది. కోల్ కతాలో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
డోర్ డెలివరీ సేవలకు గానూ ‘బూజీ’కి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ అనుమతి కూడా లభించింది. ‘బూజీ’ సంస్థ స్థానికంగా ఉన్న వైన్ షాపుల నుంచి మద్యాన్ని సేకరించి, వినియోగదారులకు అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ ద్వారా వినియోగదారుల ప్రవర్తనను ఈ యాప్ అంచనా వేస్తుందని యాప్ నిర్వాహకులు తెలిపారు.
దేశంలో ఇప్పటికే అనేక నగరాల్లో మద్యం డెలివరీకి అనుమతి ఉంది. ఢిల్లీ వంటి నగరాల్లో మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే పది నిమిషాల్లోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించిన సంస్థ మాత్రం బూజీనే.
- Advertisement -