ఐపీఎల్ చరిత్రలో తొలిసారి…

277
gayle
- Advertisement -

ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో జరగని అరుదైన ఫీట్ జరిగింది. ఒకే రోజు రెండు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు…ఇక రెండో మ్యాచ్‌లో సూపర్‌లో మరో సూపర్ ఓవర్‌…ఆధ్యంతం క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చింది ఐపీఎల్‌.

తొలుత అబుదాబి వేదికగా జరిగిన సూపర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓడించగా, దుబాయ్‌ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల ఒక సూపర్‌ ఓవర్‌లో కాకుండా రెండు సూపర్‌ ఓవర్లలో తేలడం విశేషం.

గతంలో సూపర్‌ ఓవర్‌లోనూ రెండు జట్ల స్కోర్లు సమమైతే ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించేవారు. కానీ సూపర్‌ ఓవర్‌లో ఏదో జట్టు విజేతగా నిలచేవరకు సూపర్ ఓవర్‌ని ఆడించాలని ఐసీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఐపీఎల్‌లో ఈ నిబంధనను అమలు చేయగా క్రికెట్ ఫ్యాన్స్ సండేను తెగ ఎంజాయ్ చేశారు.

- Advertisement -