రివ్యూ: లైగర్

61
liger
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌ బ్రీడ్). ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. మైక్ టైసన్ కీలకపాత్రలో నటించగా సినిమాతో పూరి మెప్పించాడా లేదా చూద్దాం…

కథ:

బాక్సింగ్ ఛాంపియన్ కావాలని పెద్ద కలలు కనే విజయ్ దేవరకొండ చుట్టూ కథ తిరుగుతుంది. అయితే విజయ్‌కి నత్తి ఉండటంతో అతి పెద్ద సవాల్‌ని ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సమస్యలు ఏంటి? తల్లి రమ్యకృష్ణ నుండి ఎలాంటి మద్దతు లభిస్తుంది.?అనన్యతో లవ్‌ ట్రాక్‌ ఎలా ఏర్పడుతుంది అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ నటన, తల్లీ కొడుకుల సన్నివేశాలు. సినిమా కోసం విజయ్ దేవరకొండ బాగా కష్టపడ్డాడు. ముఖ్యంగా నత్తిగా మాట్లాడే సమస్యతో అతడి డైలాగ్ డెలివరీ సూపర్బ్. అనన్య పాండేకు పెద్దగా స్క్రీన్ స్కోప్ లభించలేదు. ఇక రమ్యకృష్ణ తన మార్క్‌ నటనతో ఆకట్టుకుంది. మైక్ టైసన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక మిగితా నటీనటుల్లో విష్ణు రెడ్డి, రోహిత్ రాయ్,గెటప్ శీను తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ పాటలు, స్క్రీన్ ప్లే, యాక్షన్ సన్నివేశాలు సరిగ్గా సెట్ కాలేదు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. మదర్ సెంటిమెంట్‌పై సినిమా తీయడం మరియు అందులో యాక్షన్ పార్ట్‌ను పొందుపరిచి పూరి తెరకెక్కించిన విధానం బాగుంది. సినిమా మొత్తాన్ని కలర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేసిన విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

తీర్పు:

తల్లి సెంటిమెంట్‌కు యాక్షన్‌ను జోడించి పూరి తెరకెక్కించిన చిత్రం లైగర్. విజయ్ నటన సినిమాకు ప్లస్ కాగా స్క్రీన్‌ ప్లే, యాక్షన్ సన్నివేశాలు మైనస్ పాయింట్‌లుగా నిలిచాయి. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే చిత్రం లైగర్.

విడుదల తేదీ: 28/08/2022
రేటింగ్: 2.5/5
నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాత:పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

- Advertisement -