IPL 2025:గుజరాత్ నాలుగో విజయం

24
- Advertisement -

ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్.. 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌లలో హెట్ మైర్ 32 బంతుల్లో 52 పరుగులు చేయగా సంజూ శాంసన్ 41 పరుగులు, రియాన్ పరాగ్ 26 రన్స్ చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రిసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీశాడు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన గుజరాత్ వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసింది.

Also Read:రాజకీయాల్లోకి రేణు దేశాయ్!

- Advertisement -