మెదక్‌ ఎంపీ మెజార్టీపై రామన్న గురి..!

249
ktr
- Advertisement -

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. మార్చి 1 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్న కేటీఆర్ భారీ మెజార్టీతో ఎంపీ స్థానాలు గెలిచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్‌కు గట్టిపట్టున్న మెదక్‌ ఎంపీ స్థానాన్ని దాదాపు 5 లక్షల మెజార్టీతో గెలిచేలా క్షేత్రస్థాయి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

మార్చి 3న మెదక్ పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలు,నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్‌. మెదక్‌ పార్లమెంట్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఇక్కడినుండి ఆపార్టీ బలపర్చిన అభ్యర్థులు 9 సార్లు గెలుపొందగా హస్తం కంచుకోటకు బీటలువేస్తూ 2004 నుండి టీఆర్ఎస్ ఈ స్థానంలో తిరుగులేని మెజార్టీతో గెలుస్తూ వస్తోంది. 2014లో దాదాపుగా 3.97 లక్షల మెజార్టీతో గెలుపొందిన కేసీఆర్‌..ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు.

టీఆర్ఎస్ అధికారంలోకి రావడం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్ నుండి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట,మెదక్,నర్సాపూర్, పటాన్‌చెరు,దుబ్బాక,గజ్వేల్ అసెంబ్లీ స్ధానాల్లో టీఆర్ఎస్
గెలుపొందగా ఒక్క సంగారెడ్డి స్ధానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. సంగారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థిపై 1700 స్వల్పమెజార్టీతో జగ్గారెడ్డి గెలుపొందారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్‌ ఓట్లశాతం గత ఎన్నికలకంటే గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి మెజార్టీ 5 లక్షలకు పైగా సాధించేలా ప్రతిఒక్క కార్యకర్త పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సీఎం కేసీఆర్,కేటీఆర్,హరీష్ నేతృత్వంలో మెదక్‌ స్ధానాన్ని తిరుగులేని ఆధిక్యంతో గెలుస్తామన్నారు. ఇక కాంగ్రెస్
నుండి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి భార్య నిర్మల,మాజీ మంత్రి సునితా మహేందర్ రెడ్డి పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్నా టీఆర్ఎస్‌ గెలుపు నల్లేరుపై నడకే కానుంది. దీంతో సాధించే మెజార్టీపైనే దృష్టిసారించారు గులాబీ పార్టీ నేతలు.

- Advertisement -