బాబు వెన్నులో వణుకుపుట్టిస్తున్న టీఆర్ఎస్‌..!

244
chandra babu
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ఏపీ సీఎం చంద్రబాబులో రోజురోజుకి అసహనం పెరిగిపోతోంది. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ కంటే టీఆర్ఎస్ నేతల పేరు చెబితేనే చంద్రబాబు వెన్నులో వణకుపుట్టే పరిస్థితి నెలకొంది. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడం…దీనికి కొనసాగింపుగా మంత్రి తలసానితోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అటాక్‌లతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఏపీలో ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పిన కేటీఆర్ ఎవరో ఒకరితో పొత్తులేకుండా చంద్రబాబు బతకలేరని ఆరోపించారు. చంద్రబాబు, కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని… చంద్రబాబు దుర్మార్గపు పాలనపోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.అంతేగాదు ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం
చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలకు తోడు బీసీ నేత,మంత్రి తలసాని గుంటూరులో బీసీ శంఖారావం నిర్వహిస్తామని ప్రకటించడంతో చంద్రబాబు అసహనం పతాకస్ధాయికి చేరింది.

టీడీపీ నేతలు అడపదడపా కేటీఆర్‌,తలసానికి కౌంటరిస్తున్న ప్రజల నుండి పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో స్వయంగా బరిలోకి దిగారు చంద్రబాబు. ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేసీఆర్,మోడీ డబ్బు సంచులతో వస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కి ఆంధ్రాప్రజలంటే కోపం,వైసీపీ అంటే ప్రేమ ఉందని మండిపడ్డారు. అయితే చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.

ఎందుకంటే విడిపోయిన కలిసుందామని పలు సందర్భాల్లో చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. అంతేగాదు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ,కేసీఆర్ కూతురు కవిత డిమాండ్ కూడా చేశారు. రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం జోక్యాన్ని నిరసిస్తూ ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియను ముందుకుతీసుకొచ్చిన కేసీఆర్‌..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఇక
ప్రధాని నరేంద్రమోడీ సైతం తెలుగురాష్ట్రాల మధ్య సఖ్యత కోసం కేసీఆర్ ఎంతగానో ప్రయత్నించిన చంద్రబాబు మాత్రం పదేపదే సమస్యలు సృష్టించేందుకే ప్రయత్నించారని చెప్పడంతో బాబు డిఫెన్స్‌లో పడ్డారు. తాజాగా వైసీపీ కంటే టీఆర్ఎస్ నేతల అటాక్‌తో ఆత్మరక్షణలో పడిపోయారు ఏపీ సీఎం.

- Advertisement -