ఖతార్…ఫైనల్లో మెస్సీ రికార్డుల పంట

85
- Advertisement -

ఖతార్ వేదికగా 2022వ ఫిఫా ప్రపంచకప్ తుది సమరం జరగనుంది. అర్జెంటీనా ఫ్రాన్స్ జట్ల మధ్య జరగనున్న ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఏడు కొత్త రికార్డులు నమోదుకానున్నాయి. అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడైన పిలే రికార్డులను బద్దలు కొట్టనున్నారు. డిసెంబర్ 18న లుసైల్ ఐకానిక్ స్టేడియంలో చివరి మ్యాచ్‌ జరగనున్న వేళ రికార్డులను తిరగరాయడానికి మెస్సీ సిద్ధమవుతున్నారు.

ఫిఫాలో అత్యధిక మ్యాచ్‌లు 2006లో అర్జెంటీనా తరపున ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన మెస్సీ ఇప్పటివరకు 25మ్యాచ్‌లు ఆడారు. మరియు ఫైనల్‌ మ్యాచ్‌ ద్వారా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించినున్నారు. మెస్సీ జర్మనీ లోథర్ మాథౌస్‌తో కలిసి ఐదు ప్రపంచకప్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృ్ష్టించనున్నారు.

ఫిఫాలో అత్యధిక నిమిషాలు ఇప్పటివరకు ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డే కాకుండా అత్యధిక సమయం మైదానంలో గడపిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నారు. మెస్సీ ఇప్పటివరకు 2194నిమిషాలు మైదానంలో గడిపాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో అతను 24నిమిషాలు ఆడితే ఇటలీ మాజీ డిఫెండర్‌ పాల్‌ మాల్ది రికార్డును బద్దలు కొడతాడు. మాల్డీ మొత్తం 2217నిమిషాలు మైదానంలో గడిపారు.

అత్యధిక విజయాలు మెస్సీ ఫిఫాలో మొత్తం 16మ్యాచ్‌లు గెలిచాడు. ఫైనల్‌లో గెలిస్తే మెస్సీకి 17వ విజయం అవుతుంది. జర్మనీ మాజీ స్ట్రైకర్ మిరోస్లోవ్ క్లోస్ ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లను గెలిచాడు. దీంతో రికార్డును సమం చేయనున్నారు మెస్సీ.

అత్యధిక అసిస్ట్‌లు మెస్సీ ఇప్పటివరకు ఫిఫాలో మొత్తం తొమ్మిది అసిస్ట్‌లను అందించాడు. ఫైనల్‌లో తన సహచరులకు రెండు గోల్‌లను సెట్‌ చేయగలిగితే ప్రపంచకప్‌లో అత్యధిక అసిస్ట్‌లు అందించిన పీలే రికార్డును బద్దలు కొడతాడు. పీలే ఫిఫా ప్రపంచకప్‌లో 10అసిస్ట్‌లను అందించాడు. ప్రస్తుతం మెస్సీ 2వ స్థానంలో ఉన్నాడు.

బహుళ గోల్డెన్‌ బంతులు 2014లో ఫిఫాలో మెస్సీ ఫైనల్‌ ఓడిపోయిన గోల్డెన్ బాల్‌ అందుకున్నాడు. ఒకవేళ ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిస్తే మరోసారి గోల్డెన్ బాల్ అందుకొనున్నాడు. 92యేళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే వ్యక్తి రెండు గోల్డెన్ బాల్‌ సాధించుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు.

గోల్డెన్ బూట్, బాల్‌ 2022 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మెస్పీ ఆరు మ్యాచ్‌లలో ఐదు గోల్స్‌ చేసి ఆగ్రస్థానంలో ఉన్నాడు. ఒకవేళ గోల్డెన్ బూట్ గెలిస్తే ప్రపంచంలోనే గోల్డెన్ బూట్ బాల్ అందుకున్న ఏడవ వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. అంతకు ముందు బ్రెజిలియన్ త్రయం లియోనిడాస్ డా సిల్వా (1938), గారించా (1962), మరియు రొనాల్డో (1998 గోల్డెన్ బాల్, 2002 గోల్డెన్ బూట్), ఇటాలియన్ ద్వయం పాలో రోస్సీ (1982) మరియు సాల్వటోర్ స్కిల్లాసి (1990) యొక్క ఎలైట్ జాబితాలో చేరతాడు. , మరియు మాజీ అర్జెంటీనా స్టార్ మారియో కెంపెస్ (1978).

అత్యధిక గోల్స్‌కు సహకారం ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ మొత్తం 20గోల్స్ చేయడానికి సహకరించాడు. అందులో అతను 11సార్లు గోల్స్‌ చేశారు. మిగిలిన తొమ్మిది సందర్భాల్లో సహచరులకు గోల్‌ కోసం సహకరించాడు. మెస్సీ మరో రెండు గోల్స్ చేయడానికి సహకరిస్తే పీలే రికార్డును తిరగరాయనున్నారు. ఇప్పటివరకు పీలే 14మ్యాచ్‌లో 22 సార్లు గోల్‌ పోస్ట్‌ వరకు తీసుకెళ్లి 12 గోల్స్ చేశారు. మరో 10అసిస్ట్‌లకు అందించారు.

ఇవి కూడా చదవండి…

ఫిఫా..అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్‌

ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా..

గోల్డెన్ బూట్ కోసం పోటీ…

- Advertisement -