ప్రముఖ బిజినెస్ మెన్ శరవణన్ ‘లెజెండ్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్ కి ముందే టీజర్ , ట్రైలర్ తో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైన ఈ హీరో సినిమా కాస్త ఆలస్యంగా ఓటీటీ లోకి వచ్చింది. పెద్ద ఆఫర్స్ వచ్చినా కొంత టైమ్ తీసుకొని హాట్ స్టార్ కి సినిమాను ఇచ్చారు.
తాజాగా లెజెండ్ సినిమా ఓటీటీ లో భారీ వ్యూస్ కొల్లగొడుతూ దూసుకెళ్తుంది. నిజానికి ఈ సినిమా విషయంలో హీరో చాలా ట్రోలింగ్ కి గురయ్యాడు. హీరో అవ్వాలనే కోరికతో లేట్ వయసులో శరవణన్ చేసిన ఈ ప్రయత్నానికి థియేటర్స్ లో ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే థియేటర్స్ లో డిజాస్టర్ అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీ లో మాత్రం రికార్డ్ వ్యూస్ తో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
ఈ సినిమా ఓటీటీలో రిలీజైన ఒక్కరోజులోనే ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. తాజాగా డిస్నీ + హాట్ స్టార్ ఈ రికార్డ్ ను సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేశారు.
ఇవి కూడా చదవండి..