- Advertisement -
వస్త్ర ప్రపంచంలో శరవణన్ స్టోర్స్ ఆధినేత శరవణన్ తమిళ ప్రజలకు సుపరిచితమే. కానీ చిన్ననాటి కలను 50యేళ్ల వయస్సులో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. గతంలో తన బ్రాండ్‌కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. 60 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్ తో.. థియేటర్లలో రిలీజ్ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు.
లెజెండ్ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. డిసెంబర్లో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని కోలీవుడ్ టాక్.
ఇవి కూడా చదవండి…
లోకనాయకుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
బన్నీతో పవన్ డైరెక్టర్.. ఈ సారైనా కుదురుతుందా?
రాజ్ కుమార్…ఘోస్ట్
- Advertisement -