క్యాస్టింగ్ కౌచ్‍‏ కొత్తవారికి తప్పదు..

240
Lakshmi Rai
- Advertisement -

గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న అంశం క్యాస్టింగ్ కౌచ్. సినిమా అవకాశాల పేరిట మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేశారు. నాటి నుంచి నేటి వరకు క్యాస్టింగ్ కౌచ్ పై నటీమణులు స్పందిస్తూనే ఉన్నారు.

Lakshmi Rai

తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై నటి రాయ్ లక్ష్మీ స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమకు వచ్చే కొత్త నటీమణులకు ఎదురయ్యే మొదటి సమస్య. చాలా మంది అమ్మాయిలను అవశాల పేరిట లొంగ తీసుకోవాలని చూస్తుంటారు.

ఇంకా చిత్ర పరిశ్రమలో ఈ క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతూనే ఉంది. నాకు క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదురయ్యాయి. కానీ నేను ఏనాడు వాటికి లొంగలేదు. అమ్మాయిలు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీరెడ్డి విషయంపై అడగగా.. చిత్ర పిరిశ్రమలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై శ్రీరెడ్డి వెలుగెత్తి చాటుతోందని చెప్పారు. ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తోందని చెప్పుకొచ్చారు.

- Advertisement -