వెండితెర ప్రతినాయికలు

48
lady
- Advertisement -

సినీలోకంలో కథానాయికలు గ్లామర్‌ తీసుకొస్తారు. అలాంటి కథానాయికలు విలనిజం పండిస్తే ఏలా ఉంటుందో కదా… కానీ గయ్యాళితనంగా అలనాటి ఆణిముత్యం సూర్యకాంతం తనదైన శైలిలో జీవించారు. కానీ నేటి తరం కథానాయికలు మాత్రం కొంచెం డిఫరేంట్‌గా తమను ప్రపంచాన్నికి పరిచయం చేసుకుంటున్నారు. ప్రతి సినిమాలో తమ గ్లామర్‌తో సినిమాను ప్రేక్షకుల మదిని పొగోట్టిన కథానాయికలు ఉన్నారు. అయితే కొందరు పాత్ర కోసం అందంను పక్కనపెట్టి అభినయానికి ఇంపార్టెంట్‌ ఇస్తున్నారు. అందుకోసం నెగటివ్‌ రోల్స్‌ ఎంచుకుంటున్నారు.

నరసింహాలో నాదారి రహాదారి డోంట్‌ కమ్‌ మై వే అనే డైలాగులు అందరికి గుర్తు ఉన్నాయి. కానీ అదే సినిమాలో నాఇంటి పని మనిషి ఏలా ఉంది అనే డైలాగ్‌ ఎంతమందికి గుర్తు ఉంది. అలా విలనిజాన్ని పండించి తనకంటూ సినీ పరిశ్రమల్లో ఒక కొత్త పేరును నిలబెట్టుకుంది రమ్యకృష్ణ. రజనీకాంత్‌ను ముప్పతిప్పలు పెట్టి ఢీ అంటే ఢీ అనేల నటించింది.

నైన్ట్సీలోని కథానాయికలే కాదు నేటితరం నాయికలు కూడా విలనిజంను పండిస్తున్నారు. సీత సినిమాలో కాజల్‌ నెగటివ్‌ రోల్‌ పోషించి విమర్శకులను సైతం మెప్పించారు. రాశీ నిజం సినిమాలో గోపిచంద్‌తో కలిసి ప్రతినాయిక పాత్రను పోషించారు. ప్రతినాయిక పాత్రలు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పేరుపొందాయి. ధనుష్‌ నటించిన ధర్మయోగి సినిమాలో త్రిష కూడా ప్రతినాయిక పాత్ర పోషించారు.

ఆర్‌ఎక్స్‌100 మూవితో తెలుగు తెరకు పరిచయమైన పాయల్‌ రాజ్‌పుత్‌ చెడ్డదానిలా కనిపించింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ పందెంకోడి2 ద్వారా తెలుగు తెరకు లేడి విలన్‌గా పరిచయము అయ్యారు. ఎంత సక్కగా ఉన్నవే లచ్మీ అంటూ పాడే నాయిక మాత్రం వెబ్‌సీరిస్‌లో విలనిజాన్ని పండించింది. విక్రమ్‌ హీరోగా నటించిన పత్తు ఎంద్రాకుల్లా మూవీలోను కూడా ప్రతి నాయికత్వం ప్రతిభను ప్రదర్శించింది.

మణిరత్నం రూపొందిస్తున్న మూవీ పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలో ప్రపంచ సుందరి విలన్‌గా నటిస్తుందన్ని టాక్‌. చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మణిరత్నం గారి సినిమాలో ప్రతినాయిక పాత్రను ఐశ్వరరాయ్‌ బచ్చన్‌ పొషిస్తున్నారు. పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌ వన్‌లోఈ మూవీలో డ్యూయల్‌ రోల్‌ చేస్తున్న ప్రపంచ సుందరి… అందులో ఓ క్యారెక్టర్‌లో విలన్‌గా మణిరత్నం చూపించబోతున్నాడు.

 

 

 

- Advertisement -