ప్రస్తుతం వరుస సక్సెస్ లతో తన కెరీర్ ను అద్భుతంగా డిజైన్ చేసుకుంటున్న ఓ యంగ్ హీరో ఓ లేడీ నిర్మాతతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని తెలుస్తుంది. కొన్నేళ్లుగా ఈ ఇద్దరు కలిసే ఉంటున్నారు. పార్టీలు , పబ్బులులలో తరచూ కనిపిస్తున్నారట. ఇండస్ట్రీలో కూడా చాలా మందికి వీరి విషయం తెలుసని టాక్. అయితే ఇప్పటికే ఈ యంగ్ హీరో తన ఫ్రెండ్స్ తో పాటు ఇండస్ట్రీలో కొందరికి ఈ విషయం చెప్పి ఓపెన్ అవుతున్నాడట.
ఇటివలే ఈ జంట ఓ పార్టీలో కనిపించి హైలైట్ అవ్వడంతో ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వార్త గట్టిగా వినిపిస్తుంది. త్వరలోనే ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొందరు లేదు లివింగ్ రిలేషన్ షిప్ నే కంటిన్యూ చేస్తారని ఇంకొందరు అంటున్నారు. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌజ్ లో నిర్మాణ భాద్యతలు చేపడుతూ బిజీ గా ఉండే లేడీ నిర్మాత త్వరలోనే ఈ యంగ్ హీరోతో ఓ సినిమా నిర్మించే ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది.
ఏదేమైనా ఇండస్ట్రీలో కాస్త క్లోజ్ గా ఉంటే చాలు రిలేషన్ అంట గట్టేస్తారు. అలాంటిది వీరిద్దరూ పార్టీల్లో పక్కపక్కానే కనిపిస్తుంటే ఇంకెంత మాట్లాడుకుంటారు ? మరి వీరిద్దరి విషయం త్వరలో ఏమైనా అఫీషియల్ గా బయటికొస్తుందా? చూడాలి.
ఇవి కూడా చదవండి…