‘ఖుషి’ బిహైండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ

1964
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఒకప్పటి బిగ్గెస్ట్ హిట్ ‘ఖుషి’ ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఖుషి రీ రిలీజ్ కంటెంట్ తో పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం ఖుషి బిహైండ్ స్టోరీస్ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.

యే మేరా జహాన్ – పవన్ కళ్యాణ్ ఆలోచనే
సినిమాలో కోల్‌కత్తా నేపథ్యానికి సరిపోయేలా పూర్తి స్థాయి హిందీ పాటను కంపోజ్ చేయాలనే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారిదే. నాకు ఆ ఆలోచన చాలా నచ్చింది. వెంటనే అబ్బాస్ టైర్‌వాలా ను తీసుకువచ్చి ‘యే మేరే జహాన్‌’ పాటను రాయించాము. యే మేరే జహాన్ రెగ్యులర్ ఇంట్రడక్షన్ సాంగ్ కాదు. ఇది దేశభక్తిని ప్రతిభింబిస్తుంది. దేశాన్ని ప్రేమించే ఒక యువకుడి గురించి ఉంటుంది. అతను తన చుట్టూ ఏదైనా తప్పు చూసినప్పుడు ప్రజల కోసం నిలబడతాడు. కొందరు రాజకీయ నాయకుల స్వభావాన్ని కూడా ప్రశ్నిస్తాడు. అబ్బాస్ టైర్‌వాలా కేవలం ఒక గంటలో పాట రాశారు. ఇది చాలా వినూత్నమైన ఆలోచన అందుకే అందరికీ బాగా నచ్చింది. పూర్తి క్రెడిట్ పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది.

యాక్షన్ సన్నివేశాలు… పవన్ కళ్యాణ్ కృషి
పవన్ కళ్యాణ్ స్వయంగా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఖుషికి ప్రధాన హైలైట్. పోరాటాలు ఏవీ బలవంతంగా చొప్పించినట్లు ఉండవు. సహజంగా రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలో కలిసిపోయాయి. సినీ పరిశ్రమలో చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ ‘లల్లూ అంకుల్ మాలూమ్ తెరేకు’ లాంటి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అయితే, థియేటర్లలో దీనికి ఆ స్థాయి స్పందన వస్తుందని నేను ఊహించలేదు. మాస్ పల్స్ గురించి పవన్ కళ్యాణ్ ఉన్న అవగాహనను స్పష్టంగా చూపించింది. తన కెరీర్‌లో ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసినప్పటికీ, అతనిలో మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నాడని నేను ఎప్పుడూ నమ్ముతాను.

లండన్ లో ఫస్ట్ తెలుగు రిలీజ్ ఖుషినే
అప్పట్లో తెలుగు సినిమాలను తమిళనాడులో విడుదల చేయడంలో కొంత జాప్యం జరుగుతుండగా.. ఖుషి చిత్రం మాత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఒకే రోజు విడుదలైంది. మణిరత్నంతో సహా తమిళనాడులోని పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించారు. లండన్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా కూడా ‘ఖుషి’నే. నా కుమారుడు అదే సమయంలో లండన్‌లో చదువుతున్నాడు. దాంతో ఖుషిని అక్కడ విడుదల చేయడానికి అతడి స్నేహితుడి సహాయం తీసుకున్నాం.

ఖుషి క్లైమాక్స్‌ మార్పు
తమిళ వెర్షన్ క్లైమాక్స్‌లో జంట కవలలకు జన్మనిచ్చినట్లు చూపించాలి అనుకున్నాము. అయితే అప్పటికే మేము మరో వెర్షన్ కి చిత్రీకరించాము. కొన్ని కారణాల వల్ల దానిని మార్చలేకపోయాం. తెలుగు వెర్షన్ కోసం మాత్రం దానిని అమలు చేసాము. తెలుగు క్లైమాక్స్ పట్ల నేను చాలా సంతోషించాను. 10 ఏళ్లలోపులో చాలా మంది పిల్లలకు జన్మనివ్వడం చాలా సరదాగా అనిపించింది.

ఇవి కూడా చదవండి…

సంక్రాంతి పెద్ద పండగ:శేఖర్‌మాస్టర్‌

ఎన్టీఆర్‌ కోసం బాలీవుడ్‌ విలన్‌..?

నాగ్…నిజంగా మన్మథుడే!

- Advertisement -