బ్రాహ్మణులు అగ్రవర్ణాలకు చెందినప్పటికీ ఈ కులం లో అనేకమంది పేదవాళ్లు వున్నారు…కేసీఆర్ సీఎం అయ్యాక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశారన్నారు బ్రహ్మణ పరిషత్ మాజీ చైర్మన్ కేవీ రమణాచారి. బ్రాహ్మణుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. అర్చకులను ప్రతి నెల దూపదీప నైవేద్యం ద్వారా కేసీఆర్ ఆదుకున్నారని…బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు రేవంత్ రెడ్డి నిధులు కేటాయించాలన్నారు.
బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ స్కాలర్ షిప్ ను విడుదల చేయాలి…బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు నిధులు విడుదల చేయడంపై క్యాబినెట్ లో చర్చించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల వరకు అయినా నిధులు కేటాయించాలి…బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లో పని చేసే కింది స్థాయి ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు అన్నారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు నిధులు కేటాయించకపోతే బ్రాహ్మణ సంఘాలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తాము…బ్రాహ్మణ పరిషత్ కు కొత్త పాలక వర్గం ఏర్పాటు చేయాలన్నారు. బ్రాహ్మణుల్లో చాలా మంది నిరుపేదలుఉన్నారు..బ్రాహ్మణుల గురించి ఆలోచించింది కేసీఆర్ మాత్రమేనన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పి.వి.నరసింహారావు బ్రాహ్మణులను ఆదుకున్నారు…ప్రభుత్వాలు మారితే పధకాలు మంచిగా అమలు కావాలన్నారు. ఇప్పుడు వున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతున్నాయి…బ్రాహ్మణుల దగ్గర మేధాసంపత్తి తప్ప ఆస్తులు లేవు అన్నారు.
చాలా మంది బ్రాహ్మణులు ఇతర దేశాల్లో స్థిరపడ్డారు…మన దేశంలో బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వం నుండి బ్రాహ్మణులకు మద్దతు ఉండాలి…విదేశాల్లో వున్న బ్రాహ్మణ విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే స్కాలర్ షిప్ విడుదల చేయాలన్నారు.
రమణాచారి బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ అయ్యాక అనేక మంది పేద బ్రాహ్మణులకు న్యాయం జరిగిందన్నారు బిఆర్ఎస్ నేత జి .దేవిప్రసాద్. అనేక మంది పేద బ్రాహ్మణ విద్యార్థులు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా విదేశాలకు వెళ్లారు…బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు నిధులు రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పిందన్నారు. బ్రాహ్మణ పరిషత్ లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు…విదేశాల్లో చదువుతున్న బ్రాహ్మణ విద్యార్థులు స్కాలర్ షిప్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద బ్రాహ్మణుల పట్ల ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని…బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు.
Also Read:ముద్రగడ పేరు మారింది!