కేటీఆర్ రాజకీయాల్లో తనకంటు ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. రాజకీయాల్లో దూసుకుపోతునే సోషల్ మీడియాల్లో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆపధలో ఉన్నవారిని ఆదుకుంటూ అభాగ్యులకు చేయూతనిస్తున్నారు. గతంలో ట్విట్టర్ వేదికగా అనేక మందికి సాయం చేస్తూ సరికొత్త పాలనకు అర్ధం చెబుతున్నాడు కల్వకుంట్ల తారకరామరావు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి క్షణాల్లో తన అధికారిక కార్యాలయం నుంచి సీఎం రిలీవ్ ఫండ్ ను విడుదల చేస్తూ సాయం చేస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ చిన్నారి కంటి చూపు సమస్యతో బాధపడుతున్నట్లు వారు చేసి అభ్యర్థను స్వీకరించి క్షణాల్లో ఆ చిన్నారినికి చేయటం పట్ల నెటిజన్లు కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వారి అభ్యర్థన ఇలా…
కేటీఆర్.. అన్నయ్య చిన్న పాపకు కంటి సమస్య ఉంది. ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయాలి. మీరు ఒక లెటర్ విడుదల చేస్తే ఉచితంగా చికిత్స చేస్తారు. సంబంధిత పాప కుటుంబం ఆంధ్రప్రదేశ్‌కు చెందింది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదు. దయచేసి సహాయం చేయండి అన్నయ్య. అంటూ భరత్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్విట్ చేశాడు. అందుకు అయన వెంటనే స్సందించి నా అధికారిక బృందం ఎల్వీప్రసాద్ ఐ హాస్పటల్ లేదా సరోజిని దేవి ఆస్ప్రత్రిని సంప్రదించి సాయం చేస్తారని కేటీఆర్ రిట్విట్ చేశారు.