కొత్త సర్పంచ్‌లకు కేటీఆర్ విషెస్..

217
ktr
- Advertisement -

తెలంగాణ పంచాయతీ పోరు ముగిసింది. మూడు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు,వార్డు మెంబర్లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి మరోసారి తెలంగాణ ప్రజలు వారి ప్రేమను చూపించి.. పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టారని కేటీఆర్‌ పేర్కొన్నారు. 9 వేల పైచిలుకు గ్రామపంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారని కేటీఆర్‌ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో పార్టీలు వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థుల ఖర్చూ భారీగా పెరిగింది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు సైతం ప్రచారం నిర్వహించారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని పంచాయతీలను అభ్యర్థులు వేలంలో రూ.లక్షలు పెట్టి సొంతం చేసుకున్నారు.

- Advertisement -