మంత్రి ఎర్రబెల్లికి శుభాకాంక్షల వెల్లువ..

233
errabelli
- Advertisement -

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదినం సందర్భంగా శనివారం ఆయనకు ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ట్వీట్‌ చేయగా ఎర్రబెల్లి దయాకరరావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న గార్లకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.

వీరితో పాటు హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ,వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

- Advertisement -