కరోనాతో టాలీవుడ్ నిర్మాత మృతి..

29
producer pokuri

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు ఇకలేరు. కరోనా సోకడంతో కొద్దిరోజులుగా హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.పోకూరి మరణించడం చిత్రసీమని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.

ఈ త‌రం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోద‌రుడే పోకూరి రామారావు. ఈ త‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌లో రూపొందిన పలు చిత్రాల‌కు ఆయన స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఈత‌రం ఫిల్మ్స్ లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్నిఅందించారు.

నేటి భారతం, ఎర్ర మందారం, యజ్ఞం, రణం వంటి అనేక హిట్ చిత్రాలు ఈ తరం బ్యానర్ లో తెరకెక్కాయి. పోకూరి రామారావు అకాల మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.