వరద బాధితులకు బాసటగా మంత్రి కేటీఆర్‌..

275
ktr
- Advertisement -

హైదరాబాద్ నగరంలో మూడో రోజు వరద ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వరద బాధితులకు బాసటగా నిలుస్తున్నా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరియు స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. ఈ నేపథ్యంలో నగరంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రేషన్ కిట్లను పలువురికి అందించారు మంత్రి శ్రీ కేటీఆర్. బేగంపేటలో ప్రకాష్ నగర్, బ్రాహ్మణ వాడి ప్రాంతాలను పరిశీలించిన అనంతరం అక్కడ ముంపుకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులకు మంత్రి కేటీఆర్ రేషన్ కిట్లను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు అందిస్తాం. ప్రభావిత కాలనీలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామన్నారు. షెల్టర్ హోమ్‌లో ఉన్న వారందరికీ ఆహారంతోపాటు దుప్పట్లు, మందులు అందిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. నగరంలో ప్రజలు తాగునీటి విషయంలో కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. కాచివడపోసిన నీటిని తాగాలని మంత్రి సూచించారు.

- Advertisement -