ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం: నిరంజన్‌ రెడ్డి

148
niranjan reddy

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్ ఎ స్మైల్’ పిలుపులో భాగంగా ఆక్సీజ‌న్, వెంటిలేట‌ర్ స‌హా స‌క‌ల స‌దుపాయాల‌తో తయారుచేయించిన అంబులెన్స్ ను ఇవాళ వనపర్తి జిల్లా ఆసుపత్రికి అందజేశారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి… అత్యవసర సేవల కోసం అందుబాటులో అంబులెన్స్ ఉంటాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం మని… తెలంగాణ రాష్ట్రంలో నాణ్యతతో కూడిన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కిట్ తో ప్రభుత్వ వైద్యశాలలలో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు.

శస్త్ర చికిత్సలు తగ్గి సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగిందని… తొల్సూరు కాన్పు మాత్రమే కాదు మల్సూరు కాన్పు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుందన్నారు. కళ్యాణలక్ష్మితో పెళ్లికి, కేసీఆర్ కిట్ – అమ్మవడితో కాన్పుకు సర్కారు చేయూతనిస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపులో భాగంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అంబులెన్స్ అందజేయడం జరుగుతుందన్నారు.