బతుకుదెరువు కోసం గల్ఫ్ కు వెళ్ళిన తెలంగాణ బిడ్డలకు కష్టాలు తప్పడం లేదు. గల్ఫ్ దేశాల్లో తాము పడుతున్న కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి చేసిన పొస్ట్ వైరల్ గామారింది. కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి బుతుకుదెరువు కోసం రెండు ఏండ్ల కింద అబుదాబి వెళ్లాడు. అబుదాబికి సుమారు 20కిలోమీటర్ల దూరంలో ఓ వ్యక్తి వద్ద పనిచేస్తున్నాడు. అతని దగ్గర ఉన్న ఒంటెలను కాయడం ఇతని పని. బతుకు దెరువు కోసం వెళ్లిన తనకు ఆ ఓనర్ చిత్ర హింసలు పెడుతున్నాడని ఆ వీడియో ద్వారా తెలిపాడు. ఆ వీడియోలో అతను ఈవిధంగా తన బాధను తెలుపుకున్నాడు. మాది కరీంనగర్ జిల్లా తుమ్మాపురం మండలం.
మాది పేద కుటుంబం. అబుదాబికి వచ్చి రెండేళ్లు అవుతుంది. మా యజమానికి వంద ఒంటెలు ఉన్నాయి. అందులో ఒక ఒంటే అనారోగ్యంతో మరణించడంతో మా యాజమాని నన్ను చావ బాదాడు…ఇష్టం వచ్చినట్టు నన్ను ఎక్కడ పడితే అక్కడ కొట్టిండు..పండ్లు ఉడిపోయి సరిగ్గా మాట్లాడడానికి కూడా వస్తలేదు. నేను నివసించే ప్రాంతంలో కరెంట్ ఉండుదు.. అన్నం తెచ్చి ఇచ్చే వాళ్లు కూడా ఉండరు. ఉదయం పని చేసి మళ్లీ మా వంట మేమే వండుకోవాలి. మా అమ్మ చనిపోయింది అని చెప్పినా కూడా నన్ను ఇండియాకు పంపిస్తలేడు.
దయచేసి నన్న ఎలాగైనా ఇండియాకు తీసుకుపోండి సార్ అని ఆ వీడియో ద్వారా తెలిపాడు. తాజాగా సోషల్ మీడియాలో ద్వారా ఈవీడియో చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈవిషయాన్ని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈలో భారత రాయబారి ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా కోరారు. అతన్ని ఎలాగైనా విడిపించి భారత్‌కు వచ్చేలా చూడాల్సిందిగా కోరారు. కేటీఆర్ ట్వీట్‌కు యూఏఈ భారత రాయబారి నవదీప్ సూరి స్పందించారు. రియాద్‌లోని ఎంబసీ సదరు వ్యక్తి అంశాన్ని పరిశీలిస్తుందని తెలిపారు.